అన్నమయ్య: రాయచోటిలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తానని అన్నమయ్య జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సురేంద్రారెడ్డి అన్నారు. విజయవాడలో రాష్ట్ర అధ్యక్షుడు కామన ప్రభాకర్ రావు, ఉపాధ్యక్షుడు సింగం రామకృష్ణా రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు గాజుల భాస్కర్ చేతులమీదుగా నియామక పత్రం అందుకున్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.