GNTR: సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలపై జగన్ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. జగన్ ఒక రాజకీయ నాయకుడిలా కాకుండా జైలు ఖైదీలా మాట్లాడుతున్నారని నసీర్ ఎద్దేవా చేశారు.