బెల్లం టీని తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. జీర్ణవ్యవస్థ శుభ్రంగా మారుతుంది. పేగుల్లో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. మలబద్ధకం తగ్గుతుంది. తిన్న ఆహారం సుభంగా జీర్ణమవుతుంది. కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. రక్తం వృద్ధి చెందేలా చేస్తుంది. దీంతో రక్తహీనత తగ్గుతుంది. దగ్గు, జలుబు తగ్గుతుంది. జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు.