MBNR: రాబోవు రెండు రోజులలో మహబూబ్నగర్ పురపాలక పరిధిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని. పురపాలక కమిషనర్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఆదేశాల మేరకు అందరూ అందుబాటులో ఉండాలన్నారు.