AP: వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి నారాయణస్వామి మొబైల్ ఫోన్ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్(FSL)కు పంపేందుకు ACB కోర్టు అనుమతించింది. దీంతో సిట్ అధికారులు మొబైల్ ఫోన్ను FSLకు పంపించారు. మద్యం కేసులో ఇటీవల ఆయనను సిట్ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. అనంతరం నారాయణస్వామి మొబైల్ స్వాధీనం చేసుకున్నారు.