E.G: వైసీపీ పార్టీ విష వృక్షంలా మారిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తుంటే.. వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.