ASF: జిల్లాలోని గిరిజన పాఠశాలల్లో పనిచేస్తున్న CRTల వేతనాలను వెంటనే విడుదల చేయాలని NHRC ఛైర్మన్ రాథోడ్ రమేష్ కోరారు. శుక్రవారం కలెక్టర్ వెంకటేష్ దోత్రేకు వినతిపత్రం అందజేశారు. జిల్లాలో విధులు నిర్వహిస్తున్న 460 మంది CRTలకు 5 నెలలుగా వేతనాలు అందడం లేదన్నారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి ITDA POకు నివేదిక పంపిస్తామని తెలిపారు.