TG: పలు శాఖల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. గోదావరి పుష్కరాల సన్నద్ధత, ముందస్తు ప్రణాళికలపై కమాండ్ కంట్రోల్లో సీఎం సమీక్షించనున్నారు. అనంతరం ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగులు, పోస్టుల సంఖ్యపై సమీక్షకు ఏర్పాటు చేసిన కమిటీతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.