KRNL: ఎమ్మిగనూరులో జరిగిన వీరనారి రజక ఐలమ్మ, విద్యుత్ పోరాటంలో అమరులైన సత్తెనపల్లి రామకృష్ణ వర్ధంతి సందర్భంగా 2025 డీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని ఘనంగా సన్మానించారు. రజక ఆణిముత్యాలకు ఏపీ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించి, మెమెంటో అందజేశారు.