NLR: విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకంలో వంట నిర్వాహకులు మెనూ ప్రకారం మెరుగైన భోజనం అందించాలని MEO మస్తాన్ వలీ సూచించారు. ఆయన శుక్రవారం సీతారామపురంలోని మోడల్ స్కూలును ఆకస్మికంగా తనిఖీ చేసి భోజనాన్ని రుచి చూశారు. వంట ఎలా ఉందంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి తరగతి గదిని, విద్యాబోధన తీరును పరిశీలించారు.