ATP: తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి అధికారులు కొలతలు వేశారు. మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టారనే ఫిర్యాదు మేరకు ఈ చర్యలు చేపట్టారు. టౌన్ ప్లానింగ్ అధికారిణి సుజాత మాట్లాడుతూ.. ప్లాన్ అప్రూవల్ లేకుండా 10 సెంట్లకు గానూ 12 సెంట్లలో నిర్మాణం చేపట్టినట్లు తేలిందన్నారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని తెలిపారు.