ASR: కాఫీ బెర్రీ బోరర్ కీటకం సోకిన కాఫీ తోటల్లో యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కే.సూర్యనారాయణ కోరారు. శుక్రవారం అరకు మండలం పకనకుడి గ్రామంలో రైతు సంఘం సభ్యులు పర్యటించారు. కాఫీ తోటలు పరిశీలించారు. అవసరమైతే రాష్ట్ర నలుమూలల నుంచి అధికార యంత్రాంగం వచ్చి, అరకు ఆర్గానిక్ కాఫీని కాపాడుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.