HNK: కాజీపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల ఆవరణలో శుక్రవారం పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా రెవెన్యూ అధికారి వై వి గణేష్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత అంపశయ నవీన్, కాళోజి ఫౌండేషన్ అధ్యక్షులు నాగిళ్ల రామగిరి శాస్త్రి, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు కే. ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.