ASR: జీకేవీధి మండల గృహనిర్మాణ శాఖ ఏఈగా లక్ష్మీ విమలను నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం లక్ష్మీ విమల బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుతం ఆమె దామనాపల్లి గ్రామ సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. మండలంలోని గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఇళ్లను వేగవంతమయ్యేందకు చర్యలు తీసుకుంటానని అన్నారు.