VZM: నేపాల్ దేశంలో జరుగుతున్న మారణ హోమ సంఘటనలో చిక్కుకున్న తెలుగు ప్రజలకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారని విజయనగరం జిల్లా డిసిసిబి ఛైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. శుక్రవారం చీపురుపల్లిలో ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. నేపాల్ దేశంలో తెలుగు ప్రజలు చిక్కుకొని అల్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి కనీసం స్పందించకపోవడం విచారకరమన్నారు.