NDL: పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు అర్బన్ పరిధిలోని మాధవి నగర్ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి క్యాంపు కార్యాలయంలో ఇవాళ గ్రీవెన్స్ డే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రజల ఫిర్యాదులు స్వీకరించారు. అన్ని మండలాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.