TPT: వెంకటగిరి పోలేరమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి వెంకటగిరి యువరాజు సర్వజ్ఞకుమార యాచేంద్ర శుక్రవారం బంగారు హారం సమర్పించారు. ప్రతి ఏట జాతరలో అమ్మవారికి రాజా ప్యాలెస్ నుంచి సారే, సరవల్లు సమర్పిస్తారు. ప్రత్యేకంగా చేయించిన బంగారుహారంను అమ్మవారికి సమర్పించి దర్శనం చేసుకున్నారు. అమ్మవారి చల్లనీ చూపు ప్రతిఒక్కరిపై ఉండాలని అన్నారు.