W.G: యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ఆటో, రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి.వి.ప్రతాప్ డిమాండ్ చేశారు. శుక్రవారం తణుకు అమరవీరుల భవనంలో జరిగిన యూనియన్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం దసరా నుంచి రూ.15 వేలు ఇవ్వడానికి ముందుకు రావడం అభినందనీయమని అన్నారు.