అన్నమయ్య: జీతాలు చెల్లించాలంటూ బివైఎస్ ఆధ్వర్యంలో మదనపల్లె ఎంపీడీవో కార్యాలయం వద్ద ఇవాళ కురవంక పంచాయతీ కార్మికులు నిరసన చేపట్టారు. అధ్యక్షుడు పునీత్ మాట్లాడుతూ.. గత రెండు నెలలుగా కార్మికులకు జీతాలు చెల్లించలేదని తెలిపారు. కార్మికులకు జీతాలు చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీవోకు వినతి పత్రం అందజేశారు.