KDP: నిరుద్యోగులు ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మైలవరం మండల ఎంపీడీవో రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఇవాళ స్థానిక వెలుగు కార్యాలయంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎంపీడీవో రామచంద్రారెడ్డి నిరుద్యోగులకు పలు సూచనలు అవకాశ మార్గాలను తెలియజేశారు. 65 మంది ఇంటర్వ్యూకు హాజరు కాగా 55 మంది సెలెక్ట్ అయ్యారని తెలిపారు.