ASF: కాగజ్ నగర్ మండలం అరెగూడ గ్రామనికి చెందిన నాయకులు వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా MLC దండే విఠల్ సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ.. MLC విఠల్ నాయకత్వంలో నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమని నమ్మి కాంగ్రెస్ లో చేరామన్నారు.