MDK: విద్యార్థులను క్రమశిక్షణతో మెలిగే విధంగా తీర్చిదిద్దాలని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అధ్యాపకులకు సూచించారు. ఇవాళ చేగుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ఇంఛార్జ్ పాల్గొని విద్యార్థులకు సూచనలు చేశాడు. ఆత్మ కమిటీ ఛైర్మన్ నరేందర్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, సొసైటీ ఛైర్మన్ అయిత రఘురాములు, పరంజ్యోతి పాల్గొన్నారు.