NZB: భారత రాజ్యాంగాన్ని రక్షించడమే సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి నిజమైన నివాళి అని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సీతారాం ఏచూరి మొదటి వర్ధంతి కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏచూరి తన జీవితాన్ని కార్మిక వర్గ రాజ్యం స్థాపన కోసం అంకితం చేశారని కొనియాడారు.