KRNL: హాలహర్వి మండలం చింతకుంట శివారులో ఇవాళ తాత్కాలిక వంతెన కోతకు గురికావడంతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కట్ర వంక ఉధృతంగా ప్రవహిస్తోంది. జాతీయ రహదారి వంతెన నిర్మాణం ఇంకా పూర్తికాకపోవడంతోనే ఈ దుస్థితి తలెత్తిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.