MBNR: ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సంబంధించిన డబ్బులు క్రమం తప్పకుండా వస్తున్నాయా అని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి హన్వాడ మండలం వేపూరు గ్రామానికి చెందిన పావనిని ప్రశ్నించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ వేపురు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా లబ్ధిదారు పావనితో మాట్లాడుతూ.. ఎన్ని చదరపు అడుగులలో ఇంటిని నిర్మిస్తున్నారని ప్రశ్నించారు.