VZM: వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే అదితి గజపతి రాజు శుక్రవారం సందర్శించారు. ఈసందర్బంగా రైతుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ కర్రోతు నరసింగరావు, డైరెక్టర్ వర్రి సంతోషి తదితరులు పాల్గొని ఎమ్మెల్యేను దుశ్శాలువాతో సత్కరించారు. ఇందులో ఏఎంసీ సిబ్బంది, రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు.