MBNR: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఎస్పీఎఫ్ అధికారుల నిర్లక్ష్యం కట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఈ నెల 9వ తేదీన పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేరిన మహిళ బిడ్డకు జన్మనివ్వగా బిడ్డ చనిపోయాడు. ఆ వెంటనే ఆమె కూడా చనిపోయింది. ఎస్పీఎఫ్ అధికారులు పట్టించుకోకపోవడంతో బంధువులు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. దీనిపై సర్వత్రావిమర్శలు వస్తున్నాయి.