NZB: తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నదాతల ఆత్మబంధువు అని,కాంగ్రెస్ రైతుల పాలిట రాబంధువు అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అభివర్ణించారు. కేసీఆర్ పాలన రైతులకు స్వర్ణ యుగం కాగా కాంగ్రెస్ రాకతో అన్నదాతలకు కన్నీటి యుగం వచ్చిందని ఆయన శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.