ATP: విపత్తులు ఎక్కడ వచ్చినా టీడీపీ సాయం అక్కడ ఉంటుందని MLA దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. నేపాల్ నుంచి తెలుగు వారిని తీసుకురావడం దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. తెలుగు వారిని సురక్షితంగా ఇళ్లకు చేర్చడం గొప్ప విషయమని చెప్పారు. ఇది మంత్రి లోకేశ్ చొరవ వల్లే సాధ్యమైందని దగ్గుపాటి తెలిపారు. MLA దగ్గుపాటి మంత్రి లోకేశ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.