W.G: చిన అమిరంలోని అంబేద్కర్ సెంటర్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పాము సుబ్బారావు, సత్యవతి దంపతుల ఇల్లు శుక్రవారం దగ్ధమైంది. ఈ దుర్ఘటనలో బాధితులు నిరాశ్రయులయ్యారు. కాళ్ల మండల అధ్యక్షులు గుజ్జుల నిరక్షణరావు ఆర్థిక సహాయంతో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు గుండె నగేష్ బాబు బియ్యం, కూరగాయలు, చీరలు, కిరాణా సరుకులను బాధితులకు అందజేశారు.