NRML: కడెం మండలంలోని లింగాపూర్ గ్రామంలో నిరుపేద చెంచులకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీపీఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ కార్యదర్శి సునారికారి రాజేష్ కోరారు. శుక్రవారం ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు, ఉట్నూర్ ఐటీడీఏ పీఓ కుష్బూ గుప్తాలకు వినతి పత్రం సమర్పించారు. చెంచులు గత 70 సంవత్సరాలుగా నివసిస్తున్నారని, వారికి ఇళ్లు లేవన్నారు.