HYD: శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి ప్రమాదం జరగకముందే చర్యలు చేపట్టాలని GHMC కమిషనర్ కర్ణన్ సూచించారు. శుక్రవారం GHMC ప్రధాన కార్యాలయంలో చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్‌తో కలిసి టౌన్ ప్లానింగ్ విభాగంతో సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా సెల్లార్ తవ్వకాలు చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.