KDP: మున్సిపల్ కార్పొరేషన్లో శానిటేషన్, ఇంజినీరింగ్ సెక్షన్లలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు ఇవ్వాలని, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ CITU జిల్లా ఉపాధ్యక్షులు తిరుపాల్ హెచ్చరించారు. మూడేళ్లుగా నియామకాలు నిలిచిపోవడంతో కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు. కారుణ్య నియామకాలు ఇవ్వకపోతే నిరసనలు చేస్తామన్నారు.