తిరుపతి మహతి కళాక్షేత్రం వేదికగా టీటీడీ సౌజన్యంతో రాయలసీమ రంగస్థలి 35వ వార్షిక స్వర్ణోత్సవ నృత్య కళోత్సవాలు వైభవంగా శుక్రవారం ప్రారంభమయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన అనేక కళాబృందాలు ఈ ఉత్సవాలలో పాల్గొన్నారు. ముందుగా చిన్నారుల నృత్య ప్రదర్శనలు అలరించగా, దశావతారాలను వివరిస్తూ చేసిన నృత్యం విశేషంగా ఆకట్టుకుంది. పాల్గొన్న ప్రతి బృందానికి బహుమతులను అంధించారు.