BDK: లక్ష్మీదేవి పల్లి మండలం హేమచంద్రపురం గ్రామస్తులు శుక్రవారం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముర్రేడు వాగుపై వంతెన నిర్మాణం సాధించిన సందర్భంగా కూనంనేని చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తమ చిరకాల కోరిక నెరవేర్చడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కో-ఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ జగన్, మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.