W.G: భీమవరంలో సారధ్య యాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ ఆధ్వర్యంలో భారీ శోభాయాత్ర నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర దాదాపు రెండు కిలోమీటర్లు సాగి, ఆనంద ఇన్ ఫంక్షన్ హాలుకు చేరుకుంది. ఈ యాత్రలో వేలాదిగా బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.