TG: ఈ నెల 15న కామారెడ్డిలో నిర్వహించనున్న కాంగ్రెస్ సభ వాయిదా పడింది. భారీ వర్షాల కారణంగా సభను వాయిదా వేస్తున్నట్లు PPC ప్రకటించింది. సభ ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని త్వరలోనే తెలియజేస్తామని పేర్కొంది. కాగా, బీసీ డిక్లరేషన్ ప్రకటించిన సందర్భంగా సభ నిర్వహించాలని నిర్ణయించారు. లక్ష మందితో సభ పెట్టాలని భారీ ఏర్పాట్లు చేశారు.