AP: బాపట్ల జిల్లా అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 218 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 5 మందికి ఎల్ఓసీ పత్రాలు అందజేశారు. ఈ క్రమంలో మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ, పేదవాడి ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.