TG: భారీ వరదలకు ఉస్మాన్ సాగర్ నిండుకుండలా మారింది. దీంతో అధికారులు ఉస్మాన్ సాగర్(గండిపేట) డ్యామ్ 6 గేట్లను 4 అడుగుల మేర ఎత్తి 2,652 క్యూసెక్కుల వరద నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని అధికారులు తెలిపారు. నార్సింగి, మంచిరేవుల మధ్య ఉన్న కల్వర్టు పైనుంచి వరద ప్రవహించడంతో అధికారులు ఇరువైపులా రాకపోకలను నిలిపివేశారు.