GDWL: అయిజను రాబోయే డీలిమిటేషన్లో తప్పకుండా అసెంబ్లీ నియోజకవర్గం చేస్తానని, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, పాలమూరు ఎంపీ డీకె. అరుణ హామీ ఇచ్చారని బీజేపీ జోగులాంబ గద్వాల జిల్లా మాజీ అధ్యక్షుడు ఎస్. రామచంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం అయిజలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ హామీతో అయిజ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.