NLG: మర్రిగూడలో శుక్రవారం ఎన్ ఫోర్స్ మెంట్,విజిలెన్స్ అధికారులు పలు చౌక ధరల దుకాణాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. కొందరు డీలర్లు రేషన్ బియ్యం బదులు లబ్ధిదారులకు డబ్బులు ఇచ్చి వారే కొనుగోలు చేస్తున్నారనే సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించామని అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో ఎన్ఫోర్స్మెంట్ DTరఘునందన్, విజిలెన్స్ అధికారులు యాదయ్య,అంజయ్య పాల్గొన్నారు.