NLG: తోపుడు బండ్లను తొలగించి, తమను నిరాశ్రయులను చేయవద్దని కోరుతూ నకిరేకల్ పట్టణంలోని చిరు వ్యాపారులు శుక్రవారం బీజేపీ నేతలతో కలిసి మున్సిపల్ కమిషనర్ రంజిత్‌కు వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో నేతలు పల్స శ్రీనివాస్ గౌడ్, జిల్లా డాకయ్య, మంగళపల్లి కిషన్ వ్యాపారులు సైదులు, అంజయ్య, రాజు, రాములమ్మ, భాస్కర్, అనిత, వెంకన్న, నాగేందర్ పాల్గొన్నారు.
Tags :