నంద్యాల జిల్లా భానుముక్కలలో శ్రీ సుంకులమ్మ దేవి ఆలయం వద్ద ఉగాది సందర్భంగా శుక్రవారం బండలాగుడు పోటీలు నిర్వహించారు. మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో 12 జతలు గిత్తలు పోటీపడ్డాయి. చెన్నూరు గ్రామానికి చెందిన గుమ్మల సాయికుమార్ రెడ్డి ఎద్దులు 5377 అడుగులు బండను లాగి ప్రథమ స్థానం సాధించాయి.