SS: ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల సర్పంచుల పదవీ కాలం ముగిసిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సన్మాన సభ నిర్వహించారు. వైసీపీ నుంచి గెలుపొంది ఐదేళ్లుగా ప్రజలకు విశేష సేవలు అందించిన సర్పంచులను ఆయన సన్మానించి అభినందనలు తెలియజేశారు. అభివృద్ధికి సర్పంచులు చేసిన కృషిని ఈ సందర్భంగా కేతిరెడ్డి కొనియాడారు.