ATP: పాల్తూరు నుంచి గాజుల మల్లాపురం వెళ్లే రహదారిలో అగ్నిప్రమాదం నెలకొంది. శుక్రవారం మధ్యాహ్నం రోడ్డుపై భారీ మంటలు చెలరేగాయి. ఈ మంటలు వేగంగా వ్యాపించి సుమారు 20 గడ్డివాములు కాలి పోయాయి. అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు కలిసి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాద కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనతో పశువుల మేతను కోల్పోయిన రైతులు తీవ్రంగా నష్టపోయారు.