ASR: విద్యార్థులు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని డుంబ్రిగుడ ఎస్సై ఎల్.సురేష్ సూచించారు. శుక్రవారం స్థానిక ఏకలవ్య మోడల్ రెషిడెన్సియల్ పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ మేరకు విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. బాలికలు, మహిళల రక్షణకు పటిష్టమైన చట్టాలు ఉన్నాయని తెలిపారు. ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినా, వేధింపులకు పాల్పడినా ధైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు.