అన్నమయ్య: సమాజ ఆరోగ్య పరిరక్షణలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎనలేనివని హ్యుమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అఫ్ ఇండియా స్టేట్ డైరెక్టర్ ఆదినారాయణ అన్నారు. మంగళవారం ములకలచెరువు (M) బురకాయలకోట సచివాలయ పరిధిలోని పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను శాలువతో సన్మానించారు. విధి నిర్వహణలో వారి సేవలను కొనియాడుతూ దుస్తులు పంపిణీ చేశారు.