సత్యసాయి: పుట్టపర్తిలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కలెక్టర్ చేతన్ యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. పుట్టపర్తి సాయి ఆరామంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, విద్యార్థులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యోగా దినోత్సవ వేడుకలు దాదాపు నెలరోజులపాటు కొనసాగనున్నట్లు తెలిపారు.