E.G: రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ కార్యాలయంలో “ప్రజా దర్బార్ “కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన వివిధ రకాల వినతులను ఎమ్మెల్యే స్వీకరించారు. సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.