GNTR: ఏపీ పర్యాటక శాఖతో ఆలివ్ హాస్పిటాలిటీ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా గుంటూరు, విశాఖ, తిరుపతి, విజయవాడల్లో మొత్తం 2,000 హోటల్ గదులను నిర్మించనుంది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు 55 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా గుంటూరు సహా ఆయా నగరాల్లో దాదాపు 700 మందికి ఉపాధి లభించనుంది.